Wednesday 27 April 2016

బెజవాడ కనకదుర్గ

బెజవాడ కనకదుర్గ 


విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ గురించి ఎన్నో ఆసక్తిదాయక కథనాలున్నాయి. ఇంద్రకీలుడు తనకు శాశ్వతత్వం ప్రసాదించమని దేవిని కోరాడట. పర్వత రూపంగా మారితే, తాను దానిమీద నివాసమేర్పరచుకుంటానని కనకదుర్గ చెప్పిందంటారు.
                                           

సముద్రం వైపు పయనిస్తున్న కృష్ణవేణికి ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డొచ్చిందని మరోకథ. తనకు కొంచెం దారిమ్మని కృష్ణానది ప్రార్థించడంతో కనకదుర్గమ్మ కరుణించిందని చెబుతారు.

బెజ్జం మార్గం ద్వారా కృష్ణవేణి ముందుకు పయనమైంది. అందువల్లే ఈ ఊరు బెజ్జంవాడ అని పేరు కలిగి అదే తరవాతి రోజుల్లో బెజవాడగా రూపాంతరం చెందిందంటారు. తాను చేసిన సహాయానికి ప్రతిగా కృష్ణవేణమ్మ ముక్కు పుడకను కనకదుర్గాదేవి అరువు తీసుకుందనీ, అది తిరిగి ఇవ్వక్కర్లేకుండా తాను కొండమీదకు లంఘించి అక్కడ ఆవాసం ఏర్పరచుకుందనీ అంటారు. కృష్ణవేణి ఇందుకు ప్రతిగా ఒక శపథం చేసిందనీ, కలియుగాంతానికి తాను కొండమీదకెగసి తన ముక్కుపుడక తీసుకుంటానన్నదనీ దానికి కొనసాగింపు. కృష్ణవేణి ముక్కుపుడకతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అలరారుతున్నదని ఎందరో భక్తులు విశ్వసిస్తారు.
                                                     

బ్రహ్మ ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఒక శివలింగం ప్రతిష్ఠించి మల్లెపూలతో అర్చించిన కారణంగా ఇక్కడున్న స్వామికి మల్లేశ్వరుడు అని పేరు కలిగిందని ఒక ఐతిహ్యం. స్వామికి వామపక్షాన ఉండాల్సిన ఆ దేవి దక్షిణం వేపు ఉండి ఎంతో శక్తిమంతురాలయిందంటారు.

పాశుపతాస్త్రం కోసం అర్జునుడు ఈ పర్వతం మీద తీవ్ర తపస్సు చేశాడని పురాణగాథ. వేటగాని రూపంలో ఉన్న పరమశివుడితో పోరాడి ఆ అస్త్రం సాధించాడు. అర్జునుడికి విజయుడనే పేరొచ్చింది. అందువల్ల ఈ నగరానికి విజయవాడ అని పేరు ఏర్పడిందంటారు.
                                                             

పల్లవ రాజైన మాధవవర్మ ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో దేవి తన ఆశీస్సులను ఈ నగరంపై వర్షించిందని చెబుతారు. దానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. రాకుమారుడు రథారూఢుడై వెళుతూ ఉండగా అతని రథంకింద పడి ఒక బాలుడు మరణించాడు. శోకతప్తురాలైన అతని తల్లి మాధవవర్మను ఆశ్రయించి ధర్మం ప్రసాదించాల్సిందిగా వేడుకుంది. ధర్మమూర్తిగా పేరు గడించిన మాధవవర్మ మరేమీ యోచించకుండా తన కుమారునికి మరణదండన విధించాడు. అతని నిష్పాక్షికతకు, ధర్మపరాయణతకు అచ్చెరువందిన దుర్గాదేవి నగరంపై పసిడి వర్షం కురిపించి రాజకుమారుని తిరిగి బతికించిందంటారు. అప్పటినుండి కనకదుర్గ పేరు బహుళ ప్రచారంలోకి వచ్చిందని పెద్దల మాట.

ఆది శంకరాచార్యులవారు ఈ ప్రాంతాలకు వచ్చేంతవరకు ఇక్కడి శక్తిస్థలంలో జంతు వధ జరుగుతుండేదంటారు. శంకరులవారు దేవి ఉగ్రరూపాన్ని శమింపజేయడం కోసం దేవాలయంలో శ్రీ చక్రప్రతిష్ఠ చేశారని, ఆనాటినుంచి బలులు పోయి అమ్మవారికి కుంకుమార్చనలు జరగనారంభించాయనీ భక్తుల విశ్వాసం. కొండపై ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లే మెట్లన్నీ పసుపు కుంకుమాదులతో అలరారుతూ భక్తుల కాంక్షలకు ప్రతిరూపంగా కనబడుతూ ఉంటాయి. నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి వేనవేన కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. విజయదశమి నాడు కృష్ణానదిలో తెప్పోత్సవం వీక్షకులకు నయనానందకరం!


స్థలపురాణము :

అమ్మ :
శక్తి స్వరూపిణి... త్రైలోక్య సంచారిణి... వేదమాత... అమ్మలగన్నయమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ... అఖిలాండ కోటి బ్రహ్మాండనాయికైన శ్రీ జగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వ రులను తన ఆధీనం చేసుకుంటూ షోడశా క్షరీ మంత్రానికి అధిష్టాన దేవతగా, శ్రీ చక్ర నీరాజనాలందుకునే ఏకాదశ శక్తుల సంగ్ర హంగా, అపరాజితగా కొలువులందుకునే తల్లి. రక్షాశక్తి, మంత్రశక్తి, ప్రాణ శక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగె్వైభవశక్తి, సంహారశక్తి, ఆదిప రాశక్తి, ధార్మిక శక్తి, విజయశక్తు లు దేవిలో నిండి నిబిడీకృతమై ఇంద్రాది దేవతలచే పూజలందు కొంటూ ఇంద్రకీలాద్రిపై స్వయం భువైన అమ్మలగన్నయమ్మ బెజ వాడ శ్రీ కనకదుర్గమ్మ.

దసరా నవ రాత్రులు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా వున్న భక్తులకు, ప్రజలకు గుర్తుకు వచ్చేది బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవా లు. ఈ ఉత్సవాలను యేటా దేవ స్థానం వారు అత్యంత వైభోపేతం గా నిర్వహించటం ఆనవాయితీ. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో రెండవ స్థానం కలిగి, శ్రీ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రశస్తమైన కృతయుగం నాటి కోవె ల, అతి ప్రాచీనమైన శక్తిపీఠం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. సృష్టి, స్థితి, లయ కారిణియై న త్రిశక్తి స్వరూపిణి దుర్గమ్మ. దయామృత వర్షిణి జగన్మాతను మనసారా ఆరాధించి చరణా ల్ని ఆశ్రయిస్తే మనకున్న దుర్గ తుల్ని నాశనం చేసి పద్ధతుల్ని ఆయురా రోగ్య ఐశ్వర్యలను ప్రసాదిస్తుంది. శరన్నవ రాత్రులు ఎంతో విశిష్టమైనవి, శుభప్రదమైనవి, మంగళక రమైనవి, వివిధాలంకార భూషితయైన అమ్మ వారిని దర్శించి, ఆ తల్లికి అత్యంత ప్రీతి పాత్ర మైన కుంకుమార్చనలో స్వయంగా పాల్గొని, ఆ దుర్గాదేవి కరుణా కటాక్ష వీక్షణాన్ని పొందవచ్చు.

శ్రీ కనకదుర్గా దేవి ‘అమృత నిలయం’ క్షేత్రం, తీర్థం, అధిష్టాన దైవపరంగా అగ్రశ్రే ణికి చెందిన ఈ సుందర ఆలయానికి యుగ యుగాల ఘన చరిత్ర, తరతరాల తరగని కీర్తి అమరి యున్నాయి. విజయవాటి కాపురి ఇంద్రకీలాద్రిపై స్వయంభూవుగా వెలసిన శ్రీ కనకదుర్గాదేవి అఖిలాండకోటి బ్రహ్మాండనాయ కి అని పద్మపురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్తపురాణం, దేవీభాగవతం అద్భుతమైన తీరులో అభివర్ణించాయి.

శ్రీ కనకదుర్గ క్షేత్ర వైభవం :
పూర్వం రంభు, కరంభులనే వారు సంతా నం కోసం ఈశ్వరుని కృపకై తపస్సు చేశారు. కరంభుడు నీటిలోనూ, రంభుడు చెట్ట్డుపైన తపస్సు చేశారు. అది చూసి ఇంద్రుడు కోపం పట్టలేక మొసలి రూపంలో వచ్చి కరంభుని తినివేశాడు. దానితో రంభుడు తన తలని నరుక్కుని ఈశ్వరునికి అర్పించడంతో శివుడు ప్రత్యక్షమై కావలసిన వరం కోరుకోమంటా డు. మూడు జన్మల వరకు నువ్వే నా కొడుకు గా పుట్టాలని రంభుడు కోరుకుంటాడు.

ఈశ్వరుడు తథాస్తు అని దీవించి అంతర్థాన మవుతాడు. దానితో ఆనందంగా రంభుడు తిరిగి పోతుండగా మార్గ మధ్యలో ఒక మిహ షి కనిపిస్తుంది. ఆమెతో కామకలాపాలు సాగి స్తాడు. అప్పుడు శివుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశిస్తాడు. ఆమెకు పుట్టి న వాడే మహిషాసురుడు. అతడు పెరిగి పెద్ద వాడై తన తండ్రి సోదరుడికి జరిగింది తెలిసి ఉగ్రుడై ఇండ్రుడి మీదకు దండెత్తి జయించి స్వర్గాధిపత్యం పొందుతాడు. ముల్లోకాలను గడగడలాడిస్తాడు.

కాత్యాయన మహర్షి ఆశ్ర మానికి వెళ్ళి స్ర్తీ రూపం ధరించి బాధిస్తూవుం డటంతో ఆ మహర్షికి కోపం వచ్చి స్ర్తీ చేతిలోనే హతమవుతావని శపిస్తాడు. మహిషాసురుడి దురాగతాలు ఎక్కువైపోతుం డటంతో ఆ పరాశక్తిని ప్రార్థిస్తాడు. ఆమె ఉగ్రచండీ రూపమెత్తి మహిషాసురుని సంహ రిస్తుంది. మరో జన్మలో రుద్రకాళీ రూపంలో మహిషాసురుణ్ణి సంహరించింది. స్కందపురా ణంలో సహ్యాద్రి ఖండంలో ఈ తల్లి విజయ గాధలున్నాయి. ఈ మహాతల్లి దుష్టులపాలిట సింహ స్వప్నం. ఈ అమ్మే సరస్వతి, మహా కాళి, మహాలక్ష్మీ, బాల త్రిపుర సుందరి, లలి తాత్రిపురసుందరి, రాజరాజేశ్వరీ, కుండలినీ మహాశక్తి ఈ కనకదుర్గే.

ఆలయ స్థల పురాణ విశేష గాథ:
ఇంద్రకీలాద్రి పర్వత పాదభాగాన్ని తాకుతూ పరవళ్ళు తొక్కే కృష్ణవేణి చెంతగల ఈ పర్వతానికి ఈ పేరు రావడానికి ఐతిహ్యం వుంది. పూర్వం కీలుడు అనే యక్షుడు ఆది పరాశక్తి అయిన దుర్గా దేవి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చిన అమ్మవా రు కాలుణ్ణి వరం కోరుకోమనగా పరమ సంతోషంతో జగన్మాతను అనేక విధాల స్తుతించి ‘‘అమ్మా! నీవు ఎల్లప్పుడూ నాపై నివసించి వుండు’’ అని వరం కోరుకుంటా డు. అందుకా దుర్గాదేవి ‘‘ఓ యక్షా! నీవు పరమ పవిత్రమైన ఈ కృష్ణా నది ఒడ్డున పర్వత రూపాన్ని ధరించు.

కృతయుగంలో అసుర సంహా రానంతరం నేనే నీ పర్వతం మీద కొలువుంటాను’’ అని వరం ప్రసా దించింది. కీలుడు పర్వత రూపాన్ని పొంది దేవి ఆవిర్భావం కోసం ఎదురు చూడసాగాడు. తదుపరి కృతయుగంలో దుష్ట దనుజుడైన మహిషాసురుణ్ణి సంహరించాక ఆ దుర్గాదేవి కీలుడి కిచ్చిన మాట ప్రకా రం మహిషాసుర మర్దినీ స్వరూపంతో కీలాద్రి మీద ఆవిర్భవిం చింది. స్వర్ణమయకాంతులతో సూర్య సమప్ర భలతో ప్రకాశిస్తున్న ఆ మహిషాసురమర్దని కొలువున్న కీలాద్రి పర్వతం మీదకి ఇంద్రాది దేవతలంతా వచ్చి నిత్యం దేవికి పూజలు చేయసాగారు. ఆనాటి నుంచి ఈ కీల పర్వ తం ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. దుర్గా దేవి కనకవర్ణంతో అవతరించడం వల్ల ఈ పర్వతం కనకాచలమైంది.

స్వర్ణశిఖరం చారిత్రక నేపథ్యం:
రుద్రకాంతం అనబడే త్రితల విమానంతో 156 అడుగుల ఎత్తులో శ్రీ కనకదుర్గాలయం నిర్మించబడింది.ఇంద్రకీలాద్రి వాసినయైన అమ్మవారికి ఎదుట గుడికట్టించింది ఎవరో తెలిపే చారిత్రక ఆధారాలు ప్రస్తుతం మనకు కనిపించవు. అయితే శ్రీ కృష్ణ దేవారాయలు పరిపాలన చేసే కాలంలో మహా మాండలికు డైన సింగమదేవ రాజు వేయించిన శాసనంలో ఈ ఆలయానికి మరమ్మతుల జరిపి, ముఖ మండపాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆల యంపైకందం అనే విభాగంలో నాలుగు దిక్కు ల్లో మహిషాసురమర్దినిగా, మహాకాళి, షోడశ భుజ దుర్గాదేవి, మహాసరస్వతీ దేవి శిల్పాలు అందంగా మలచబడ్డాయి. అమ్మవారి ఆలయ శిఖరం మీద నుంచి స్థూపం వరకు పూర్తి బంగారపు పూతతో మహాపద్మాన్ని ఏర్పాటు చేశారు.బంగారు ఆలయ శిఖరాలు తిరుమల శ్రీనివాసుని తరువాత బెజవాడ కనకదుర్గమ్మ కే ఉన్నాయి.

అమ్మవారి శ్రీ చక్రం
శ్రీ చక్ర అధిష్టానదేవత శ్రీ దుర్గాదేవి. ఈ దుర్గాదేవి మహిషాసుర సంహారానంతంరం, అదే స్వరూపంతో ఇక్కడ స్వయంభువుగా రౌద్రరూపంతో వెలసింది. ఆనాటి వీర శాక్తే యులు దేవికి వామాచార పద్ధతిలో జంతు బలులు, నరబలులు నివేదించి పూజలు చేసే వారు. దాంతో దేవీ మూర్తి మరింత ఉగ్రరూ పాన్ని ధరించింది. దానివల్ల పూజల్లో ఏ చిన్న తప్పు జరిగినా కొండ క్రింది ఉన్న బెజవాడలో ఏదో ఒక ఉపద్రవం వచ్చిపడుతూ ఉండేది. ఈ స్థితిని గమనించిన జగద్గురువు ఆదిశం రాచార్యులు అమ్మవారిని శాంతి స్వరూపిణిగా మార్చి ఇక్కడ తమ మంత్రశక్తితో శ్రీ చక్ర యంత్రాన్ని ప్రతిష్టించారు. నిత్యార్చనలు, కుంకుమార్చనలు అన్నీ దేవి మూలవిరాట్‌కి కాక అమ్మవారి ప్రతిరూపమైన శ్రీ చక్రానికే జరుగుతుంటాయి.తరతరాలుగా పూజలం దుకునే శ్రీ చక్రం ఎంతో మహిమోపేతమైంది.

అలాంటిది ఆ పర్వతం మీద పరమేశ్వరుణ్ణి కూడా కొలువు వుండేలా చేయాలనే సత్సం కల్పంతో బ్రహ్మదేవుడు పరమ నిష్టతో శతా శ్వమేథయాగాన్ని చేయగా, అతని భక్తి శ్రద్దల కు మెచ్చిన పరమేశ్వరుడు జ్యోతిర్లంగ స్వరూ పంతో బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు. ఇంద్రకీలాద్రి మీద దివ్యజ్యోతిర్లింగ స్వరూ పుడై నిలిచిన జటాజూటధారి బ్రహ్మను అను గ్రహించాడు. ఆ విధంగా బ్రహ్మచే ప్రథమం గా మల్లికా పుష్పాలతో అర్పించబడిన కారణం గా ఆ స్వామికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చిం ది. కాలక్రమంలో కలిప్రభావం వల్ల జ్యోతి ర్లింగం అంతర్నిహితమై ఉండటాన్ని చూసిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కనకదుర్గాదేవికి ఉత్తర భాగంలో మల్లేశ్వర లింగాన్ని పునః ప్రతిష్టించారు. ఆనాటి నుంచి మల్లేశ్వర స్వామి కూడా ఎంతో వైభవంతో జనులందరి చేత అర్చింపబడ్డాడు.

అమ్మవారి అలంకార అంతర్యం
ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి దశమి వర కు వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్స వాలు ప్రతి ఏడాది జరుగుతాయి. అధిష్టాన దేవతకు ఒక్కొక్కరోజు ఒక్కో అవతారంతో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి పదవ రోజు విజయదశమి చేస్తారు. తిథుల హెచ్చు తగ్గుల వల్ల ఒక్కొక్కసారి 11 రోజులు దసరా ఉత్సవాలు చేయాల్సి వస్తోంది. తొలి రోజు స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవీగా, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా, ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, ఆరవ రోజు శ్రీ సరస్వతీ దేవిగా, ఏడవ రోజున శ్రీ మహా లక్ష్మీ దేవిగా, అష్టమినాడు శ్రీదుర్గాదేవిగా, నవమినాడు శ్రీమహి షాసురమర్దినీ దేవిగా అలంకరిస్తారు. విజయదశమి నాడు అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు.

Sunday 10 April 2016

హయగ్రీవ జయంతి


హయగ్రీవ జయంతి
మహావిష్ణువు హయగ్రీవుడిగా- గుఱ్ఱపు తల కలిగిన మానవాకారంగా రూపొందిన పుణ్యదినం. ఈ వృత్తాంతాన్ని దేవీభాగవతంలోని ప్రథమ స్కంధం చక్కగా వివరించింది.

ఒకానొక సమయంలో మహావిష్ణువు రాక్షసవీరులతో పదివేల సంవత్సరాలపాటు భీకరంగా యుద్ధం చేసి అలసిపోయాడు. అల్లెతాడు గట్టిగా బిగించి ఉన్న శార్ఞ్గం అనే తన ధనుస్సును నేలమీద నిలబెట్టి, దాని కోపు మీద తన గడ్డాన్ని ఆనించి నిలబడే నిద్రపోయాడు. ఆ సమయంలో విష్ణుమూర్తిని వెతుకుతూ అక్కడికి వచ్చిన దేవతలు అతడిని నిద్రలేపటానికి జంకారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక వమ్రిని (చెదపురుగును) సృష్టించి ఆ వింటినారిని కొరకవలసిందిగా చెప్పాడు. 'నిద్రపోతున్నవారిని లేపటం బ్రహ్మహత్యతో సమానమైన పాపం కనుక నేను ఆ పనిని చేయను' అన్నది వమ్రి. ఆ మాట విన్న బ్రహ్మదేవుడు 'అగ్నిహోత్రంలో హవిస్సును వేసే సమయంలో పక్కన పడినదాన్ని నీకు ఆహారంగా ఇస్తాను. ఈ దైవకార్యాన్ని చేయి!' అన్నాడు. ఆ పవిత్రాన్నం తనకు దొరుకుతున్నందుకు వమ్రి ఎంతగానో సంతోషించి ఆ నారిని కొరికింది. దానితో ఆ ధనుస్సు విసురుగా తుళ్లి, ఆ వింటికోపు విష్ణుమూర్తి మెడకు తగిలి అతడి శిరస్సు తెగి, ఎగిరి ఎక్కడో పడ్డది. ఈ తల తెగటానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన శాపమే కారణం కావటం మరొక విశేషం. అనుకోకుండా జరిగిన ఈ దారుణానికి దేవతలు చాలా బాధపడ్డారు. బ్రహ్మదేవుడు వారినోదార్చి మహాదేవిని ధ్యానించ వలసిందిగా సూచిం చాడు. వారు అట్లాగే చేశారు. ఆమె ప్రత్యక్షమైంది. దేవతలందరూ కలిసి ఆమె సూచించిన విధంగానే ఒక గుర్రాన్ని వధించి, దాని తల తీసుకు వచ్చారు. దేవశిల్పియైన త్వష్ట దాన్ని విష్ణుమూర్తి మొండానికి అతికించాడు. బ్రహ్మదేవుడు ప్రాణం పోశాడు. ఆ విధంగా విష్ణుమూర్తి హయగ్రీవుడైనాడు.
                                                               
హయగ్రీవుడు అనే రాక్షసుడున్నాడు. అతడు దేవికోసం తపస్సు చేసి, తాను మరణం లేకుండా చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని కోరాడు. ఆమె కుదరదన్నది. అతడు తనవంటి ఆకారం కలవాడి చేతిలోనే మరణించే విధంగా వరాన్ని ఇమ్మని అడిగి దాన్ని పొందాడు. ఆమె 'సరే!' అని అంతర్థానం చెందింది. ఆ వరగర్వంతో అతడు చతుర్దశ భువనాలనూ హింసించసాగాడు. ఇతడిని వధించటానికే విష్ణుమూర్తి ఇంతకు ముందు మనం చెప్పుకొన్న విధంగా హయగ్రీవుడైనాడు.
హయగ్రీవుడు చంద్రమండల నివాసి, మహానంద స్వరూపుడు. ప్రకృష్ట ప్రజ్ఞాశాలి. అతడి నాసిక నుంచే వేదాలు ఆవిర్భవించాయని పురాణగాథ. ఆయన విరాట్ స్వరూపాన్ని ధరించినప్పుడు- సత్యలోకం అతడికి శిరస్సు. భూలోకం నాభి. పాతాళం పాదాలు. అంతరిక్షం కన్ను. సూర్యుడు కంటి గుడ్డు. చంద్రుడు గుండె. దిక్పాలకులు భుజాలు. అగ్ని ముఖం. సముద్రాలు ఉదరం. నదులు నాడులు. పర్వతాలు ఎముకలు. మేఘాలు కేశాలు. అంటే హయగ్రీవుడు సమస్త దేవతా స్వరూపుడని తాత్పర్యం.

హయగ్రీవుడు తెల్లని శరీరం కలవాడు. అతడు లక్ష్మీదేవిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకొని తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటాడు. అతడి పై కుడి చేతిలో చక్రం, పై ఎడమ చేతిలో శంఖం, కింది ఎడమ చేతిలో పుస్తకం ఉంటాయి. కింది కుడిచేయి చిన్ముద్ర. వీటిలో తెల్లని పద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానానికీ, పుస్తకం సమస్త విద్యలకు, శంఖం సకల జగత్ సృష్టికి కారణభూతమైన నాదానికీ, చక్రం అజ్ఞాన సంహారానికీ చిహ్నాలు. కనుక హయగ్రీవుడిని ఉపాసించినవారికి పైన తెలిపిన ఐశ్వర్యాదులన్నీ కరతలామలకాలని తాత్పర్యం.
                                                             
'హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవ' అంటూ ఎవరైతే హయగ్రీవ నామాన్ని జపిస్తుంటాడో వారికి జహ్నుకన్య అయిన గంగానదీ ప్రవాహంతో సమానమైన వాగ్ధార సిద్ధిస్తుంది లభిస్తుందని రుషి వచనం. అందువల్లనే వైష్ణవులకు ఆధ్యాత్మిక విద్యాభ్యాసం హయగ్రీవ నామోపదేశంతోనే ప్రారంభమయ్యే సంప్రదాయం ఏర్పడింది.
ఏ దేవతకైనా అతని నామమే అతడి శరీరం. ఆ నామంలోని అక్షరాలే అతడి అవయవాలని మంత్రశాస్త్రం చెబుతున్నది.
హయగ్రీవనామం దివ్యశక్తి సంభరితమైనది. ఆ నామాన్ని స్మరించినవాడు శివస్వరూపుడవుతాడంతారు. పలికినవాడు విష్ణుస్వరూపుడవుతాడనీ విశ్వసిస్తారు. విన్నవాడు తన స్వరూపుడవుతాడన్నాడట బ్రహ్మదేవుడు స్వయంగా. హయగ్రీవ నామం అంత విశిష్టమైనది.

Sunday 15 June 2014

“గుహ్యెశ్వరి”


                                                               “గుహ్యెశ్వరి” 
శ్రీ “గుహ్యెశ్వరీ/గుఃజేశ్వరి/గురేశ్వరి/మాహామాయ” దేవి మొదలైన పేర్లుగల ఈ శక్తిపీఠం నేపాల్ దేశంలో, కాట్మాండ్ పట్టణంలోని “బాగమతి” నది వడ్డున, “పశుపతినాథ్ దేవాలయం” దగ్గర వున్నది !!

“గుహ్యెశ్వరి” అనగా-(గుహ్య – రహస్య/రహస్యాంగ) – “ఈశ్వరి” అనగా ”దేవత”–“రహస్యాంగ దేవత” అని పూర్తి అర్దం..!
సతీదేవి “రహస్యాంగమ్”(Private Part) -“రెండు” ప్రదేశాలలో పడిందని, “మొదటి” భాగం(Outer Parts), అస్సాం రాష్ట్రంలోని, “గువా”హాతి (గౌహతి) లోని “కామాఖ్యదేవి ఆలయం” వద్ద, “రెండో” భాగం(Inner Parts) ఈ ప్రదేశంలో పడిందని ఇతిహాస కధనం..! 
ఈ‌ ఆలయం పూర్తిగా “తాంత్రిక విద్యోపాసన”కు సంబందించినది. “తాంత్రికులకు” అతి ముఖ్యమైన “ఉపాసన” స్థలంగా చెపుతారు!!
ఈఆలయం విశేషం ఏమిటంటే, ఆలయ ప్రాంగణం లోనికి “హిందూ ఏతరులకు” (అన్య మతస్తులకు) ప్రవేశం లేదు.!
పూర్వం ఈ ఆలయం ఒక చిన్న “ఖాళీ ప్రదేశంలో” వుండేది. అక్కడే నివాసముండే కొంతమంది గ్రామస్తులు మొదటసారిగా ఈ దేవిని ఆరాధించటం ప్రారంభించారు. ఆ పరిణామ క్రమంలో భాగంగా, “రాజా ప్రతాప్ మల్ల” 17 వ శతాబ్దం ప్రారంభంలో(1653) ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించారు.



ఈ ఆలయం “భూటాన్ దేశ సంస్కృతికి అనుగుణంగా వారి “పగోడ” ఆకారంలో నిర్మించబడి, చూపరులకు ఆకర్షించేదిగా “వుండకపోవటం” ఆశ్చర్యంగా వుంటుంది.!
ఐతే, ఈ ఆలయ “ప్రధాన మందిరం” పుష్పమాలలతో అందంగా అలంకరించి వుండి, చూడటానికి చాలా మనోహరంగా వుంటుంది..!
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , ఇక్కడ ఆలయంలో వివాహం జరుపుకున్న జంటలు, మరో “ 6 జన్మలు పాటు” అదే “సహచర-జంట”(same couple) లుగా “పునర్జన్మలు” ఎత్తుతారని ఇక్కడి ప్రజల ప్రఘాడ నమ్మకం ! 
ఈ ఆలయంలో జరిగే “నవరాత్రి పండుగ”ల సందర్భంగా నేపాల్ రాజు , అతని కుటుంబ సభ్యులు కలిసి “భాగమతి” నదిలో పవిత్ర స్నానం చేసి పూజించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది !!
పెళ్ళైన వారు, తమ భర్తల ఆరోగ్యం కోసం ఇక్కడి దేవిని పూజిస్తూవుంటారు !! అలాగే “శత్రు-విజయం” కోసం కూడా ప్రార్ధనలను చేస్తువుంటారు.!!




శ్రీశైలము

                                             శ్రీశైలము
శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

శ్రీశైల స్థల పురాణము
పురాణాలలో శ్రీ శైలం శ్రీశైల చాలా పురాతన మైన మహాక్షేత్రము. ఇందు పర్వతుడను నైష్టిక బ్రహ్మచారి యొకడు పరార్థ ప్రవణు డై కారణ జన్ముడ వ దాగిన వాడు. కృత యుగ మున బహుకాలము త పమొనర్చినాడు. అతడు లోకమునుద్ద రింప సంకల్పి౦ఛి నాడు. తను పరార్ధ ప్రవణత చె బర మేశ్వరుని సైతము విస్మయంపడ జే సినాడు. తన తప: ఫలముగా సర్వ తీర్ధ ములలో సర్వదేవతలతో సర్వపర్వతములతో స్వర్గ మర్త్య పాతాళ స్దిత ములగు నిఖిలదివ్య పదార్ద ములతో సకల మహో ష ధులతో సదాశివుని, పరా శక్తి యగు పార్వతితో పాటు నిత్య ము తన యందు సంనిహితుడ గునట్లు తానే నాడో చేయగలిగి నాడు. శ్రీ శైల క్షేత్ర మహిమలు విప్పు చెప్పు స్కంద మందలి శ్రీ శైల ఖండము నాది యుగమందు పార్వతికి బరమేశ్వరుడి చ్చటనే చాల కాలము నాడు పంచిచి నాడు. ఈ శ్రీ శైల ఖండము నుండి రస వంతమగు మహా గ్రంథము గా ప్రవచించి, వ్యాస మహర్షి దీని సు పాయసముగా శ్రీ మల్లి కార్జున మహా దేవునికి సమర్పించుట, యాతని వలన వరములు వడయుట జరిగి బహు కాలమైనది. అవతార పురుషుడ గు శ్రీరామచంద్ర మూర్తి సీతామదేవితో నిటకు వచ్చి యిచ్చట గిరి ప్రదక్షిణ మొనర్చి తన బ్రహ్మ హత్యను దొలగించుకొనుట జరిగి యెంత కాలమో మైనది. ఇందు దాహరింపబడిన ప్రదక్షిణ విధ లో రామప్రదక్షిణ మొకటి. శ్రీరాముడు రావణ వదానంతరము తనకు దాపరించిన బ్రహ్మహత్యను బాపుకోనుట కై సేతువుకడ రామ లింగేశ్వర ప్రతిష్ట మొనర్చి నాడు. కాని, నిశ్శే షముగా దాని నిండి విముక్తుడు గాలేదు. అతడు వశిష్టాదులు నియోగింప నిటకు వచ్చి యీ గిరి ప్రదక్షణ మొనర్చి దానిని దొలగించు కొనినాడు. స్పష్టముగా శ్రీ శైల ఖ౦డ ము దీ నిని వచి౦ చు చున్నది. ఈత ని యీ గిరి ప్రదక్షిణ ఉత్తర ద్వార మగును మాహేశ్వర ము నుండి యారంభ మైనది. అ సమయమున రాముడి ట సీతా సహితు డై ఒనర్చిన ప్రతిష్టలు గూడ జాలగాలవు. త్రిపురాంత కాదుల యందలి రామేశ్వరాల యా దు లప్పుడు వెలసిన వియే! మల్లి కార్జునాలయమున నే సీతారాములు ప్రతిష్ట కు జెందిన సహస్ర లింగేశ్వరాలయములు రెండు ప్రత్యేక ముగా భిన్న భిన్న స్ధలము లందున్నవి. అవి యిందులకు నిదర్శనము. ఇవిగాక, శ్రీశైలద్వారా ములుగా ఎన్నబడుచున్న త్రిపురాంత కాదులయందు రామప్రతిష్ట త ములగు రామేశ్వరాలయాదులు తత్తి ర్ధాదులు ఎన్ని యో స్కా౦దమున వీ నితొ పాటు వర్ణింపబడుచున్నవి. ఇది గాక, రాముడింత కు ముందే సీతా న్వేషణార్ధ ముదండ కారణ్యమున సంచరించుచు ఇటకు నచ్చినట్లు హరి వంశాంతర్గముగు నాశ్చర్య పర్వము 'శే షెధర్మ' మను పేరు ధీ నిని విశ దీ కరించినది. బ్రహ్మ ఇచ్చట తప మొనర్చి మల్లికార్జునునిని ప్రసన్నునిగా జే సుకొని యాత ని వలన దన యిచ్చా మాత్ర మున సృష్టి యంత ము జరుగునట్లు వరము వడ సి, సృష్టి యంత యు నిటనుండి జరిపినట్లు స్ధల నిర్దేశముతో శ్రీ శైలఖిండ ము మనకు జూటి చెప్పచున్నది.
శ్రీశైలం-రవాణా సౌకర్యాలు:
*
హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.
*
గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.

*
రైలు మార్గములు
భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు.


*
శ్రీశైలం-దర్శనీయ ప్రదేశాలు:
శ్రీశైల దేవాలయ ప్రాంతము, శ్రీమల్లికార్జునుని దేవాలయము,భ్రమరాంబిక అమ్మవారి గుడి, మనోహర గుండము ,నాగ ప్రతిమలు , పంచ పాండవులు దేవాలయాలు ,అద్దాల మండపము ,వృద్ద మల్లికార్జున లింగము:

*
మండపాలు, పంచమఠాల ప్రాంతము
సారంగధర మఠం,రుద్రాక్షమఠం,విశ్వామిత్రమఠం,నంది మఠం

*
అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు.
పాతాళ గంగ, సాక్షి గణపతి ఆలయము, శిఖరేశ్వరం, పాలధార, పంచధారలు, ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం, శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము