శ్రీశైలం-రవాణా సౌకర్యాలు:
*హైదరాబాదు
నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ
ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా
ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.
*గుంటూరు
నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ
మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ
మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా
బాగుంటుంది.
*రైలు
మార్గములు
భారతదేశములో
ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు.
*శ్రీశైలం-దర్శనీయ
ప్రదేశాలు:
శ్రీశైల
దేవాలయ ప్రాంతము, శ్రీమల్లికార్జునుని దేవాలయము,భ్రమరాంబిక అమ్మవారి గుడి, మనోహర గుండము ,నాగ ప్రతిమలు , పంచ పాండవులు దేవాలయాలు ,అద్దాల మండపము ,వృద్ద మల్లికార్జున
లింగము:
*మండపాలు, పంచమఠాల ప్రాంతము
సారంగధర
మఠం,రుద్రాక్షమఠం,విశ్వామిత్రమఠం,నంది మఠం
*అడవిలో
గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు.
పాతాళ
గంగ, సాక్షి గణపతి ఆలయము, శిఖరేశ్వరం, పాలధార, పంచధారలు, ఆది శంకరాచార్యుడు తపస్సు
చేసిన ప్రదేశం, శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము